Tuesday, January 24, 2012

MELANCHOLY

అరె మెలంకొలీ, మెలంకొలీ!!
ఈ మెలంకొలీ, మెలంకొలీ!!
పొద్దూ రాత్రి , రాత్రి పొద్దూ , నా...
చుట్టూ చేసే కథాకళి!!

కనులు మూసినా కనులు తెరిచినా ,
కనిపించే శూన్యం ఈ  మెలంకొలీ!
చెవులు మూసినా, గోల చేసినా 
వినిపించే నిశ్శబ్దం, ఈ మెలంకొలీ!

గుండె లోతుల్లో, సుఖదుఖాల నడుమ నాటుకుపోయిన విత్తనం, ఈ మెలంకొలీ!
జీవితాన్ని కప్పివేయడానికి, జగానికి కనుపాపలకి మధ్య వేసిన ముసుగే, ఈ మెలంకొలీ!    


అరె మెలంకొలీ, మెలంకొలీ!!
ఈ మెలంకొలీ, మెలంకొలీ!!
పొద్దూ రాత్రి , రాత్రి పొద్దూ , నా...
చుట్టూ చేసే కథాకళి!!

ఉదయాన్నే సుప్రభాతంలా, తలపుకు ఇది విచ్చేస్తుంది, 
మూడంతా పాడు  చేసి, గుడ్ మార్నింగ్ అని సెలవిస్తుంది.
ప్రతి ఊహని, ప్రతి ఆశని తన చేతులతో పిసికేస్తుంది,
ప్రతి ఆలోచనని, ప్రతి భావాన్ని చివరికి తన వైపే మరలిస్తుంది. 

యే చోటయినా యే పూటయినా, వెంటాడే దెయ్యం ఈ మెలంకొలీ!
యే ఊరయినా యే తీరయినా, వెంట వచ్చే నీడే ఈ మెలంకొలీ!

అరె మెలంకొలీ, మెలంకొలీ!!
ఈ మెలంకొలీ, మెలంకొలీ!!
పొద్దూ రాత్రి , రాత్రి పొద్దూ , నా...
చుట్టూ చేసే కథాకళి!!


సాంగత్యంలో ఏకాంతం ఇది, ఏకాంతంలో కల్లోలం ఇది,
సంతోషం అనే చంద్రుడిపై కనిపించే నల్ల మచ్చే ఈ మెలంకొలీ!


సంగీతంలో మౌనగీతం ఇది, నిశ్శబ్దంలో కూనిరాగం ఇది,
సృష్టిని విడిచి కనులు దృష్టి సారించిన అదృశ్యం ఆ మెలంకొలీ!

రవి కిరణాల్లోనూ, శశి జాబిలిలోనూ, కనిపించే ఛాయ ఈ మెలంకొలీ!
సుప్రభాతంలోనూ, సంధ్యారాగంలోనూ, వినిపించే సంతాపం ఈ మెలంకొలీ!


అరె మెలంకొలీ, మెలంకొలీ!!
ఈ మెలంకొలీ, మెలంకొలీ!!
పొద్దూ రాత్రి , రాత్రి పొద్దూ , నా...
చుట్టూ చేసే కథాకళి!!

2 comments: