Wednesday, April 11, 2012

Jeevana Chakram

నవ మాసాలు ఓర్పుతో దిద్దిన పల్లవికి
ఆర్తనాదాలతో అంతిమ చరణం,
రక్త సిక్త శిరస్సుతో అభివందనం, జననం.

అమాయకత్వమనే శిలపై
ప్రేమాకరుణల ఉలితో
తల్లిదండ్రులు చెక్కే సుందర శిల్పం, బాల్యం. 

స్నేహాకర్షణల రగిలే నిప్పులో పుట్టిన,
వెచ్చని అనుభవాలతో కాలమనే చలిని కాచుకుంటూ,
పచ్చని జ్ఞాపకాలను సృష్టించుకుంటూ సాగే పయనం, యవ్వనం.

ప్రపంచమనే కటిక చీకటిలో,
ధైర్యము ప్రతిభ  అనే దీపాల వెలుగులో అడుగులు వేస్తూ,
నడిచే విచిత్ర  మార్గం, జీవితం.

ఒడిలో పెంచిన పిల్లల ఒడికై తపిస్తూ,
మనవళ్ళ బుడి బుడి అడుగుల  సవ్వడికై పరితపిస్తూ,
ఆరాటపడే సమయం, వృద్ధాప్యం.

తల్లి గర్భంలో జనించి,
ప్రపంచ గర్భంలో ఒకటై విజయ గర్భాన్ని వెతుకుతూ,
చివరికి భూగర్భంలో విలీనమయ్యే తరుణం, మరణం.

3 comments: