Wednesday, August 1, 2018

ప్రేమ గీతం

నువ్వంటే నా నవ్వు
నేనంటేనే నువ్వు

నా లోని అణువణువు
నీ కోసమే వణుకు

నీ దేహం ప్రతి వంపు
నా పేరేగా పలుకు

కైలాసం అంచుల జారి మనపై వాలిన ఈ చినుకు
అక్షింతల రూపంలో శివుడే దీవెన పలుకు
తుడిచేసి నీ కుంకుమ, ఈ వర్షం మననే కలుపు

విడి విడిగా రగిలాము
బొగ్గు బూడిదలా విరిగాము

ఇంటి దీపం వెలుగు కోసం
మైనంలా కరిగాము

సమాజం చెప్పు కింద
రాలిన ఆకుల్లా నలిగాము

విరబోసి నీ కురులు, తెంచెయ్ ఈ సంకెళ్లు
విడిచేసి నీ కొంగు, తెరిచేసెయ్ ఈ నోళ్లు
హత్తుకుని దేహాలు, వంచేద్దాం ఈ తలలు

మెడకు తాళి వేసారు
కానీ మనసుకు కాదు

పిల్లలు పుట్టారన్న మాత్రాన
ప్రేమ పుట్టకుండా ఉండదు

అనుబంధం లేని బంధంలో
బందీ అవడం ఎందుకు

పెనవేసుకునే మన పెదవులు, ఓ మధుర విప్లవానికి నాంది పలుకు
ఒంటిని రక్కేసే నీ గోళ్లు, మన ప్రేమ చరితకు చిహ్నాలే  చెక్కు
విల్లులా వంగిన నీ రొమ్ము, శృంగార బాణాలనే సంధించు
రతికేళిలో నీ అరుపులు, సింహగర్జనలై నీ స్వేచ్చని చాటు

No comments:

Post a Comment